calender_icon.png 9 September, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య సిబ్బందికి హెపటైటిస్ బీ వ్యాక్సిన్

05-09-2025 12:42:51 AM

డీఎం అండ్ హెచ్‌ఓ డా.అనిత

మంచిర్యాల, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా వైద్య సిబ్బందికి హెపటైటిస్ బీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ అనిత తెలిపారు. గురు వా రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు.

సుమా రు 1590 వ్యాక్సిన్ లు జిల్లాలోని మూడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీలు), మాతా శిశు సంరక్షణ  (ఎంసీహెచ్), జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)లో పనిచేస్తున్న వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి, హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసి, ఈ నెల 8న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వ పరంగా మొట్ట మొదటి సారిగా ఆరోగ్య సిబ్బందికి ఈ వ్యాక్సినేషన్ ఇస్తున్నామన్నారు.

ఈ సమీక్షలో ఆర్‌ఎంవోలు శ్రీమన్నారాయణ, శ్రీధర్, డి సి హెచ్ కోటేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ లు సుగుణాకర్ రావు, సుధాకర్ నాయక్, ఇన్చార్జి డిపిసి మధు, ప్రశాంతి, డిపిఓ ప్రవళిక, భాగ్య, బీడీఏంలు సదన్, భారతి, సూపర్ వైజర్ లు సుగుణాకర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్లు, వ్యాక్సిన్ మేనేజర్, డెమో బుక్క వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.