calender_icon.png 12 August, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శక పాలన కోసమే ప్రజా పాలన గ్రామసభలు

25-01-2025 12:15:40 AM

వనపర్తి, జనవరి 24 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకవంతమైన ప్రజాపాలనను అందించడమే లక్ష్యంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన గ్రామసభలను గ్రామ  గ్రామాన నిర్వహి స్తుందని... ఈ గ్రామసభల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని  ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి  పేర్కొన్నారు వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామంలో  శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గత పదేళ్లుగా బి ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేదని గ్రామాలలోని నిరుపేదలకు పదేళ్లుగా ఒక్క రేషన్ కార్డు,గాని ఇండ్లు, ఇవ్వలేదని,  నేడు నిర్వహించే గ్రామ సభల్లో రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయని, దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని  ఎవ్వరు కూడా నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అధికారులు సైతం దరఖాస్తు దరఖాస్తు చేసుకునే నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో  గోపాల్పేట, రేవల్లి, ఏదుల, మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు  అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.