calender_icon.png 12 August, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవి ఇచ్చినప్పుడు ఇవ్వండి.. మునుగోడు అభివృద్ధికి నిధులు ఆపొద్దు

12-08-2025 01:39:46 PM

  1. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టె 
  2. ప్రజలకు అన్యాయం చేయొద్దని  గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా..
  3. ఇద్దరం అన్నదమ్ములం సమర్థవంతులమే మంత్రి పదవి ఇస్తే తప్పేంటి?
  4. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): మాటిచ్చారు పదవి ఇచ్చినప్పుడు ఇవ్వండి వెనకబడిన మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మాత్రం ఆపొద్దుని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) అన్నారు. మంగళవారం మునుగోడు మండలం ఎలగలగూడెం లో  20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన  గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ  మునుగోడు అన్యాయం జరగవద్దని అన్నారు. ఇస్తామన్నమాట ఆలస్యమైంది సమీకరణాలు కుదరటం లేదు అంటున్నారు. ఎందుకు కుదరటం లేదు సమీకరణలు అని ప్రశ్నించారు. ఎవరడ్డుకుంటున్నారు రాకుండా ,నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని,పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని అన్నారు.

ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉంది.9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు.11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పా,ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే   ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంట్టి ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్న , ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని అన్నారు. భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పని చేశాను నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ దవాఖానక పోతే పేదోడికి న్యాయం జరగాలి, ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయి.  పేదవాళ్ల కండగా ఉండాలని నేను కష్టపడుతున్న, ఏ పదవి ఇచ్చినా  మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి,చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దొటి నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మాజీ సర్పంచులు జాల వెంకటేశ్వర్లు, మిరియాల వెంకటేశ్వర్లు,జక్కలి శ్రీను,నకిరేకంటి యాదయ్య, సురిగి చలపతి,తీర్పారి వెంకటేశ్వర్లు ఈదులకంటి కైలాస్, అనంత లింగస్వామి కాంగ్రెస్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.