calender_icon.png 12 August, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యంకు సేవలు పదిలం

12-08-2025 01:36:18 PM

ఎర్ర సత్యం విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం( Erra Satyam) వర్థంతి సందర్భంగా ఎర్ర సత్యం చౌరస్తా లో ఉన్న ఆయన  విగ్రహానికి  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎర్ర సత్యం పేదల అభ్యున్నతి కోసం ఎంతో  కృషి చేశారని,  చివరి క్షణం వరకు  కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి  ఆయన విశేషంగా కృషి చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ,  మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, ఎన్ పి వెంకటేష్, మారే పల్లి సురేందర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజే బెనహార్, అజ్మత్ అలి ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.