calender_icon.png 12 August, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్ లో గ్యాంగ్ వార్..

12-08-2025 01:21:22 PM

  1. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న విద్యార్థులు..
  2. ఆలోస్యంగా వెలుగులోకి వచ్చిన దాడి ఘటన 
  3. కొట్టుకున్న వాళ్లంతా అవినాష్ కాలేజ్ విద్యార్థులు..

ఎల్బీనగర్: వారంతా విద్యార్థులు...  చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకుని దేశాభివృద్ధికి కృషి చేయాల్సినవారు. కానీ, గ్రూపులుగా ఏర్పడి వీధి రౌడీలుగా మారి తన్నుకుంటున్నారు. వీరి గొడవలతో ఎల్బీనగర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక గ్యాంగ్ పై మరో గ్యాంగ్ దాడి చేసుకున్న దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఎల్బీనగర్ పోలీసులు(LB Nagar Police) తెలిపిన వివరాలు... ఎల్బీనగర్ లోని అవినాష్ కామర్స్ కళాశాల విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి అధిపత్యం కోసం నిత్యం గొడవలు పడుతున్నారు.

ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన విద్యార్థులు రెండు గ్రూపులుగా మారి పరస్పర దాడులకు పాల్పడ్డారు. దాడి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్యాంగ్ వార్ లో మొత్తం 15మందిపై కేసు నమోదు చేశారు. విద్యార్థులు ధీరజ్, ఆకాశ్ మధ్యన జరిగిన గొడవ గ్యాంగ్ వార్ గా మారినట్లు గుర్తించారు. మొత్తం 15మంది విద్యార్థులపై పోలీసులు 115(2),118(1),126(2) 351(2) r/w 3(5) BNS యాక్ట్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.