12-08-2025 01:31:59 PM
దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు..
మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతానికి చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు( Gattu Vaman Rao), నాగమణి ల హత్య కేసు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(Central Bureau of Investigation) కు అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమును ఆదేశించింది. దీంతో గట్టు వామన్ రావు హత్య కేసు మరోసారి జిల్లాలో తెరపైకి వచ్చింది. హత్య కేసును తిరిగి విచారణ జరిపించాలని, పిటిషనర్ కు భద్రత కల్పించాలని మంగళవారం సిబిఐని ఆదేశించింది.
హైకోర్టు న్యాయవాదులు(Telangana High Court Lawyers) వామన్ రావు, నాగమణి దంపతులు 2021, ఫిబ్రవరి 17న మంథని సమీపంలో మాటువేసి కొందరు ప్రధాన రోడ్డుపైనే కత్తులతో అతి దారుణంగా హత్య చేశారు. ఈ జంట హత్య కేసు అప్పట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో పలువురిని అరెస్టు చేయగా దర్యాప్తు కొనసాగుతుంది. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సమీప బంధువు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు మరోసారి సుప్రీంకోర్టు ను ఆశ్రయించగా... ఆ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు వెలుపడ్డాయి.