11 June, 2026 | 2:12 AM

సమస్యల పరిష్కారమే ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక లక్ష్యం

11-06-2026 12:20 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జూన్ 10: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యమని తహసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. ప్రజా పాలనా-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం మండలంలోని రామన్నగూడెం, సూర్యానాయక్ తండా, తిమ్మాపురం, ఉయ్యాలవాడ,వేల్పుచర్ల గ్రామాలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జల వనరుల సంరక్షణ, మొక్కల పెంపకం, వన మహోత్సవం, సురక్షిత త్రాగునీరు, ఘన వ్యర్ధాల నిర్వహణ, వర్షాకాలం సన్నద్దత కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంట మార్పిడి పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు కర్నాటి వెంకన్న, లూనావత్ కృష్ణనాయక్, బొడ్డు ఇందిరాసోమరాజు, పాశం కరుణభాస్కర్ రెడ్డి, చెరుకు వెంకటమ్మ వెంకన్న, గ్రామ ప్రత్యేకాధికారులు బిచ్చునాయక్, గణేష్, బాలునాయక్, సైదిరెడ్డి, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.