13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలు

31-03-2026 12:00 AM

గ్రామ సభలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్                           

కామారెడ్డి, మార్చి 30 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో, ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం  కలెక్టరేట్ సమావేశ హాలులో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సభలు, వార్డు ,  మున్సిపల్ సభల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.

గ్రామ సభలు,  మున్సిపల్ సభలను పండుగ వాతావరణంలో నిర్వహించడంతో పాటు ప్రజలు, ప్రజా ప్రతినిధులు చురుకుగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ సభల నిర్వహణపై నివేదికలను సిద్ధం చేసి గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని, ప్రజా ప్రతినిధులకు ముందస్తుగా ఆహ్వానాలు పంపించాలని ఆదేశించారు. ఏర్పాట్లపై ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.