23 March, 2026 | 6:08 PM

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

23-03-2026 12:00 AM

నూతనకల్, మార్చి 22 : మండల పరిధిలోని చిన్ననెమిల ఎక్స్ రోడ్ లోని సాయి సిద్ధార్థ ఫంక్షన్ హాల్ లో శ్రీ రామకృష్ణ విద్యా మందిర్ లో 2011- 12 పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  విద్యార్థిని విద్యార్థులు తమ చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.

15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కలిసి తమ స్నేహితులతో ఆనందంగా గడిపారు.అనంతరం తమ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి,మెమొంటోలను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జేరిపోతుల వెంకన్న గౌడ్, కరస్పాండెంట్ కొలిచల్మ ఉపేందర్,డైరెక్టర్లు గుర్రం యాదగిరి గౌడ్,రామసహాయం రఘువీర్ రెడ్డి,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.