బోరబండలో ఘనంగా బోనాల సంబురాలు
10-08-2026 12:00 AM
జూబ్లీహిల్స్, ఆగస్టు 9(విజయక్రాంతి): బోరబండ డివిజన్లో బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. మాజీ కార్పొరేటర్ ఎం డీ. బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో ఆనవాయితీగా నిర్వహిస్తున్న బోనాల సంబరాలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా బోరబండ డివిజన్లోని శ్రీ పోచమ్మ దేవాలయానికి 11 బోనాలను సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ విజయశాంతి స్వయంగా బోనం ఎత్తి అమ్మవారిని దర్శించుకోగా స్థానిక ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్, మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.






