ఘనంగా ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ’4వ ఎడిషన్-
శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి): స్పునల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ)పై అవగాహన పెంచే లక్ష్యంతో క్యూర్ ఎస్‌ఎం ఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నాలుగో ఎడిషన్ ‘రన్ ఫర్ ఎస్‌ఎంఏ-2026’ ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో వైభవంగా జరిగింది. ఎస్‌ఎంఏ కుటుంబా లు, వైద్యులు, కార్పొరేట్ ప్రతినిధులు, విద్యార్థులు, రన్నర్లు సహా వేలాది మంది పాల్గొ న్నారు. 21కి.మీ.,10కి.మీ.,5కి.మీ. విభాగాల్లో రన్ నిర్వహించారు.
ఐఏఎస్ జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, డాక్టర్ రాధా రమాదేవి, డాక్టర్ అశ్వి న్ దాలాల్, డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్, డాక్టర్ శివరంజని తదితరులు రన్ను ప్రారంభించారు. క్యూర్ ఎస్‌ఎంఏ సహ వ్యవస్థాప కురాలు శ్రీలక్ష్మి నలం మాట్లాడుతూ సకాలంలో చికిత్స కీలకం. ప్రతి 38 మందిలో ఒ కరు క్యారియర్గా ఉండే అవకాశం ఉంది. జ న్యు స్క్రీనింగ్తో పాటు అవగాహన అవసరం అన్నారు.ఈ సందర్భంగా ఉచిత ఎస్‌ఎంఏ క్యారియర్ స్క్రీనింగ్ కూడా నిర్వహించారు.






