వారం రోజుల్లో మహోత్సవం.. పార్క్ పునరుద్ధరణ
పార్క్‌ను పరిశీలించిన నార్సింగి డీసీ లక్ష్మారెడ్డి...
అసంపూర్తి పనులు పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలు...
రాజేంద్రనగర్ ఆగస్టు 18 (విజయ క్రాంతి) : అల్కాపూర్ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ పార్క్ను నార్సింగి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. మూడు నెలలుగా పార్క్ ముస్తాబయ్యేందుకు ఇబ్బందులు పడుతున్న పనులు త్వరగా పూర్తిచేయాలని డీసీ ఆదేశించారు.
పార్క్లో డీసీ కాంట్రాక్టర్తో మాట్లాడి, అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. దీంతో డీసీ ఆదేశాల మేరకు పార్క్ను సందర్శించి వారం రోజుల్లో పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ నదీముల్లా, వాక్ ఫర్ హెల్త్ ప్రతినిధులు విజయ్ భాస్కర్, కిరణ్, భీమారెడ్డి, భాస్కర్, యూబీడీ ప్రతినిధి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.






