జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత అదృశ్యం
19-08-2026 01:47 AM
జవహర్‌నగర్, ఆగస్టు 18 (విజయక్రాంతి): ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన జవహర్ నగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... హకీంపేట్ ప్రాంతంలోని సింగాయిపల్లిలో నజియా, భర్త సుభాని, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నజియా(30) పిల్లలతో కలిసి హకీంపేట్ లోని తండ్రి ఇంటికి వెళ్ళింది.
ఈ నెల 14న ఇంట్లో ఎవరికి చెప్పకుండ నజియా బయటకు వెళ్ళి ఇంత వరకు తిరిగిరాలేదు. దీంతో ఆమె ఆచూకి కోసం చుట్టుప్రక్కల, బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






