మహిళా సంఘాల వారితో కలిసి ఘనంగా రాఖీ పండుగ
28-08-2026 12:49 AM
మల్కాజిగిరి,(విజయక్రాంతి): మల్కాజిగిరి కమిషనర్ బి.సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయంలో 'రక్షాబంధన్' కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మహిళ స్వయం సహాయక సంఘాలు వారితో కలిసి ఘనంగా రాఖీ పండుగ జరుపుకున్నారు. ఇందులో భాగంగా నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటయ్య తన సిబ్బందితో కలిసి నేరేడ్మెట్ లో ఉన్న మహిళా సంఘాల వారితో కలిసి రాఖీ పండుగ జరుపు కున్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకటయ్య మాట్లా డుతూ వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తూ, మన ప్రాంతాలలో జరిగే అసాంఘిక కార్యకలాపాల పట్ల వారు కూడా తమవంతుగా నేర నియంత్రణలో పోలీసు వారితో ముందుండి నడవాలని సూచించారు.






