పండుగ తీపి.. కల్తీ చేదు
28-08-2026 12:50 AM
నాగోల్‌లో స్వీట్ షాపులను తనిఖీ చేయాలి
నాగోల్, ఆగస్టు27 (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి వేళ నాగోల్ పరిధిలోని స్వీట్ షాపులపై ఆహార భద్రత (ఫుడ్ సే ఫ్టీ) అధికారులు తక్షణమే తనిఖీలు ము మ్మరం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పండుగ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొన్ని దుకాణాల్లో నాణ్య త లేని నూనెలు, డాల్డా, సింథటిక్ రంగు లు వినియోగిస్తున్నారనే ఆరోపణలను, అనుమానాలను గురువారం పలువురు స్థానికులు వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌లో జరిపిన తనిఖీల్లో అనేక కల్తీ లోపాలు బయటపడటంతో అధికారు లు ముందస్తు జాగ్రత్తగా తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.






