28 August, 2026 | 2:42 AM

రోడ్ల దుస్థితిపై జుక్కల్ ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదు

28-08-2026 12:48 AM

మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 

జుక్కల్, ఆగస్టు 27 (విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో ఉన్న రోడ్లపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ హయాంలో వేసిన రోడ్డు బాగున్నప్పటికీ కమిషన్ల కోసం ఉన్న రోడ్డును తవ్వేసి కంకర వేసి వదిలేశారని, ఏడాదిగా ఇదేవిధంగా ఉందని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి అన్నారు.

ప్రజలు ప్రయాణికులు వాహనదారులు బస్సులు వెళ్లడానికి సుమారుగా అరగంట సమయం పడుతుందని ఆరోపించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎందుకోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అర్థమవుతలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో వేసిన రోడ్లు అని నిర్లక్ష్యం చేస్తున్నారా? లేక నిధులు లేవా? కావాలని ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు తెలియడం లేదు అన్నారు.

సుమారు ఐదు కిలోమీటర్ల ఉన్న మహమ్మదాబాద్ తాండ నుంచి జుక్కల్ చౌరస్తా వరకు రోడ్డు మరీ దారుణంగా మారిందని దీనిపై ప్రయాణించాలంటే ప్రజలు నరకంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా ఎన్ని రోజులు ప్రజలు నరకాయతన పడాలని అన్నారు. ప్రతిపక్షంలో ఏదైనా విషయంపై సమస్యపై తాము స్పందించేంతవరకు పనులు చేయని ఎమ్మెల్యే ఉండి ఎందుకని హేళన చేశారు.

తాను చెప్పిందే వేదం అంటూ కార్యకర్తల వద్ద కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తున్నారని కార్యకర్తలు మన భావం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని చర్చ కూడా కొనసాగుతుందన్నారు. మొత్తానికి మహ్మదాబాద్ తాండ నుంచి జుక్కల్ చౌరస్తా వరకు పాదయాత్రగా చేశామనూ ఆయన తెలిపారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పనులు చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల మండల అధ్యక్షులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.