11 August, 2026 | 2:06 AM

వైభవంగా శ్రీ కాళికాదేవి బోనాల జాతర

11-08-2026 12:49 AM
  1. శోభాయమానంగా పల్లకి సేవ
  2. పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, ఆగస్టు 10, (విజయక్రాంతి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్న ప్రముఖ శ్రీ కాళికాదేవి దేవాలయంలో సోమవారం వైభవంగా బోనాల జాతర సాగింది.అమ్మవారి పల్లకి సేవ పురవీధుల్లో శోభాయ మానంగా భక్తిశ్రద్ధలతో భక్తులు పాల్గొని పల్లకి సేవలు  తరించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భారీగా హాజరైన భక్తులకు అన్నదానం నిర్వహించారు.