17 August, 2026 | 4:16 AM

ఘనంగా లక్ష్మీనారాయణుడి కల్యాణం

17-08-2026 12:07 AM

బోధన్, ఆగస్టు 16 (విజయక్రాంతి): పట్టణంలోని బురుడుగల్లీలోని అనంత లక్ష్మీనారాయణ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం స్వామివారి కల్యా ణం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హో మం, యాగం, గోపూజ తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

మధ్యా హ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. w కార్యక్రమంలో శంకర్, చక్రి, లింగం, వెంకట్, ప్రవీణ్, ప్రసా ద్, భాస్కర్, అక్షయ్, ప్రశాంత్, వినోద్, విగ్నే ష్, నితిన్, యశ్వంత్, ప్రణయ్, శివకుమార్, కార్తీక్, సిద్దు, శివ చరణ్, అజయ్ నందు, కిట్టు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.