ఘనంగా సీతారామచంద్రస్వామి మాస కళ్యాణం
సూర్యాపేట, ఆగస్టు 11 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్ లో గల శ్రీవేదాంత భజన మందిరంలోని సీతారామచంద్రస్వామి వారి పునర్వసు జన్మ నక్షత్ర సందర్భంగా మంగళవారం స్వామివారి మాస కళ్యాణంను దేవాలయ అర్చకులు దరూరి సింగరాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహములకు పంచామృత అభిషేకం నిర్వహించారు.పట్టు వస్త్రాలు అలంకరింపజేసి,
వివిధ రకాల పూలతో అలంకారం చేసి వివిధ రకాల పండ్లతో నైవేద్యం సమర్పించారు. శాస్త్రోక్తంగా కళ్యాణతంతును నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీవేదాంత భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి నకర కంటి రాజశేఖర్ కోశాధికారి సోమ అశోక్,ఈగ వెంకటేశ్వర్లు, షీలా శంకర్, సోమ సుమన్, వాసా కృష్ణ,చి0త వెంకన్న, అర్చకులు ధరూరి రాఘవాచార్యులు, మందిర మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






