యల్లాపురం పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ
12-08-2026 01:23 AM
పాలకవీడు, ఆగష్టు 11 :మండలంలోని యల్లాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో యల్లాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు షేక్ అబూబకర్ సిద్దిక్ ఆర్థిక సౌజన్యంతో విద్యార్థులకు నోట్ బుక్స్, చూచిరాత నోట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్బంగా మండల విద్యాధికారి ఇంజమూరి కాటయ్య, మాటాడుతూ విద్యార్థులకు అవసరమైన నోట్స్, చూచిరాత నోట్స్ అందచేయడం . విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపకరించే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెరుమాళ్ల సురేష్, ప్రధానోపాధ్యాయులు షేక్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.






