ఘనంగా సీతారామచంద్ర స్వామి కల్యాణం
చారకొండ, జూన్ 12 (విజయక్రాంతి): మండల పరిధిలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో ఉన్న శ్రీ వీరాంజనేయ దేవస్థానం నాలుగవ వార్షికోత్సవం సందర్భం గా శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం సందడి సీతారాంరెడ్డి అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని పల్లకిలో భక్తి కీర్తనలు, కోలాటాలతో ఊరేగించారు.
కార్యక్రమంలో శ్రీ వీరాంజనేయ కమిటీ చైర్మన్ సందడి సీతారాం రెడ్డి, పసుల శేఖర్ రెడ్డి, పసుల రాంరెడ్డి, సర్పంచి చిలికేశ్వరం శంకర్ ముదిరాజ్, ఉప సర్పంచ్ డేరంగుల వెంకటయ్య, నాయకులు బాధగోని సాంబయ్య గౌడ్, సొప్పరి పర్వతాలు, సందడి అల్వాల్ రెడ్డి, కిష్టారెడ్డి, రఘుమా రెడ్డి, డేరంగుల అంజయ్య, యువకులు రమేష్, గడ్డమీది శ్రీను, కోట్ర వెంకటయ్య, సొప్పరి వెంకటయ్య, బాలచంద్రి, జంగయ్య, సహదేవ్ తో పాటు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






