30 April, 2026 | 2:45 AM

ఏకశిల శ్రీ గరుడ, హనుమద్‌మూర్తుల స్థాపన మహోత్సవం

30-04-2026 01:54 AM

పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కేటీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ 

సికింద్రాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఆ సీతారామ చంద్రులు ఆశీస్సులు పొందామని,ప్రజలంతా కూడా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కూకట్‌పల్లి రామాలయం వద్ద 27 అడుగుల ఏకశిల శ్రీ గరుడ,హనుమద్ మూర్తుల స్థాపన మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ ప్రజలచే విగ్రహమూర్తులకు క్షీరాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు దర్శించుకొన్నారు.  ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ 440 ఏళ్ల చరిత్ర గల ఈ కూకట్పల్లి రామాలయం వద్ద శ్రీ గరుడ, హను మద్  మూర్తుల స్థాపనతో కూకట్పల్లి దేదీప్యమానంగా వెలుగుతోందని.. గ్రామస్తులు సహకారంతో ఈ కూకట్‌పల్లి రామా లయా న్ని పునర్నిర్మించుకుని ఆ సీతారామ చంద్రులు ఆశీస్సులు పొందామని, ప్రజలంతా కూడా సుఖసంతోషాలతో ఆయురా రోగ్యాలతో పల్లెలు పాడిపంటలతో కళకళలాడుతూ ఉండాలని ఆకాంక్షిం చారు.

అనంత రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమములో దేవాలయము చైర్మన్ ఎన్. శ్రీనివాస్ రావు (చిన్న తులసి) నియోజక వర్గం కో ఆర్డినేటర్ సతీష్ అరోరా, మాజీ కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు,  ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి,తూము శ్రావణ్ కుమా ర్, పండాల  సతీష్ గౌడ్, పగుడలా శిరీష బాబురావు, మహేశ్వరీ శ్రీహరి, మాజీ ఛైర్మన్స్, బిఆర్‌ఎస్ నాయకులు, మహిళలు  తదితరులు భారీగా పాల్గొన్నారు.