10 July, 2026 | 3:09 AM

బీసీ సెల్ అధ్యక్షుడికి ఘనంగా సన్మానం

10-07-2026 01:53 AM

తాడ్వాయి, జూలై 9 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామంలో గురువారం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు అశోక్ రావు ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.... గ్రామానికి మండల స్థాయి పోస్ట్ వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా అశోక్ రావు ను సన్మానించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో రఘుపతిరావు రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.