11 August, 2026 | 2:07 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి ఘన సన్మానం

11-08-2026 12:05 AM

మహబూబ్ నగర్ ఆగస్టు 10 (విజయక్రాంతి): నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న నేపథ్యంలో వారి సేవలను గుర్తించిన ఆట (అమెరికా తెలుగు అసోసియేషన్) సంస్థ ప్రతిష్టాత్మకమైన  ‘కమ్యూనిటీ సర్వీస్ అవార్డు’ ను అమెరికా వేదికగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికీ ప్రదానం చేసింది. అవార్డు అందుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం, మహబూబ్ నగర్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్, ఎన్.పి. వెంకటేష్, కార్పొరేటర్లు తాహెర్, ప్రశాంత్, ఫకృ, షబ్బీర్ అహ్మద్, ఎంపి ప్రవీణ్ కుమార్, రమేష్ రెడ్డి, యాదగిరి గౌడ్, మజ్జీద్, పాతూరి రమేష్, రాధ గోవర్థన్, భాను చందర్, మోసిన్, నాయకులు మైత్రి యాదయ్య,  తదితరులు పాల్గొన్నారు.