31 March, 2026 | 9:51 PM

పదవి విరమణ చేసిన పఠాన్ సైదా కు ఘన సన్మానం

31-03-2026 08:37 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని తాహశీల్దార్ కార్యాలయంలో చైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న పఠాన్ సైదా మంగళవారం పదవి విరమణ చేశారు.ఈ సందర్భంగా స్థానిక తాహశీల్దార్ లావురి మంగా సిబ్బందితో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ బాలరాజు, ఆర్ఐలు జానీ పాషా, శివ, జిపిఓలు, సిబ్బంది పాల్గొన్నారు.