రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు ఆసిఫ్ అలీకి ఘన సన్మానం
కడ్తాల్, జూన్ 12,(విజయ క్రాంతి ): రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా నియమితులైన కడ్తాల్ పట్టణానికి చెందిన ఆసిఫ్ అలీని శుక్రవారం కడ్తాల్ మండల కేంద్రంలో ముస్లిం మైనారిటీ సోదరులు ఘనంగా సన్మానించారు. స్థానిక మసీద్ కుబా లో శుక్రవారం ప్రార్థనల అనంతరం పూల మాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఆసిఫ్ అలీనీ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా నియమించి సముచిత స్థానం కల్పించినందుకు ముస్లిం మైనారిటీ సోదరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీద్ ఇమామ్ జహీరుద్దీన్, మసీద్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, అహ్మద్ జానీ, ఉపాధ్యక్షుడు జావిద్, మాజీ కో ఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, జహంగీర్ అలీ, ఇర్షాద్, ఇమ్రాన్ ,అబ్దుల్ వహబ్, గౌస్, బాబా, యూసఫ్, యూనిస్, సలీం ,రహీమ్, అనీష్, అజ్గార్ అలీ, అశ్రఫ్, ఆరిఫ్ ,ఖాదర్, హిమాయత్ అలీ తదితరులు పాల్గొన్నారు






