మూడు రోజులపాటు ఘనంగా శ్రీమరకత ఆత్మ లింగేశ్వర స్వామి మహోత్సవం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పెద్ద ఆత్మకూరు గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి శ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి ఆలయం రంగుల కాంతులతో ముస్తాబయింది.నేటి నుండి రెండు రోజులపాటు శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం పెద్ద ఎత్తున జరగనున్నట్లు గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి, గ్రామస్తులు తెలిపారు.శ్రీమరకత ఆత్మ లింగేశ్వర స్వామి ఆలయం నూతన కాంతులతో అందంగా అలంకరించి ముస్తాబు చేయడం జరిగిందని గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి, గ్రామస్తులు తెలిపారు.
ఈ యొక్క మహోత్సవానికి దూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నట్లు తెలిపారు.కావున చుట్టుప్రక్కల గ్రామాలైనటువంటి అక్కంపల్లి,వెంకంపల్లి, మాసంపల్లి, మార్టూరు, జలార్పూర్, తాండూర్, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని ఆస్వాదించాలన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మూడు రోజులు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
శ్రీమరకత ఆత్మ లింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేసేందుకు గ్రామంలోని పెద్దలు,గ్రామ ప్రజాప్రతినిధులు వారికి పరిచయాలు ఉన్న వ్యక్తులకు,జిల్లా,మండల అధికారులకు,వివిధ మండలాల అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగింది.గ్రామంలో అందరూ కలిసికట్టుగా శ్రీశ్రీశ్రీ మరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం,ఆలయం అభివృద్ధి ధ్యేయంగా భావించి వారికి పరిచయం ఉన్న వ్యక్తులకు ఆహ్వాన పత్రికలు అందజేసి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






