calender_icon.png 21 February, 2026 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు

21-02-2026 12:00:00 AM

డాక్టర్ కోట నీలిమ

సనత్‌గర్ ఫిబ్రవరి 20 (విజయక్రాంతి):- హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. అమీర్‌పేట్ మైత్రీవనంలోని ఆదిత్య ఎన్‌క్లేవ్ బిల్డింగ్‌లోని కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్ నిత్యం బిజీగా ఉండే ప్రాంతాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉండకుండా ముం దస్తు తనిఖీలు చేపట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా ప్రమాదం గురుంచి తెలియగానే వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైడ్రా సిబ్బంది, ఫైర్ సేఫ్టీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.