అల్ఫోర్స్‌లో ఘనంగా జగన్నాథ రథయాత్ర
29-07-2026 12:00 AM
ముకరంపుర, జూలై 28 (విజయ క్రాంతి): నగరంలోని భగత్ నగర్ అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో జగన్నాధుని రథయా త్ర, పండరిపుర యాత్ర ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా క్టర్ వి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ జగన్నాధుని రథయాత్ర భారతదేశంలోని అత్యంత ప్రాచీన వైభవమయమైన హిందూ పండుగలో ఒకటని తెలిపారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు బోనాల నృత్యాలు అలరించాయి. ఈ ఊరేగింపు పాఠశాల నుండి భగత్ నగర్ లోని భగత్ సింగ్ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






