భద్రాద్రిలో ఘనంగా నదీహారతి
భద్రాచలం, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): పరాభవ నామ సంవత్సరం వైశాఖమాసం శుక్లపక్షం దశమినాడు భక్తుల కోలహాలం జై జై దానాలతో శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలో గోదావరి కరకట్ట ప్రదేశం పురోహితుల సమక్షంలో నదీహారతి ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఇంచార్జ్ రామ వజ్జుల రవికుమార్ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రదేశం గోదావరి తీరంలో వైశాఖమాసం శుక్లపక్షం దశమి సందర్భంగా చిన్నారులతో ప్రత్యేక భజన కార్యక్రమం బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతున్నారని అన్నారు.
హారతి విశేషాలను ముందుగా వినిపించి, గణపతి పూజ, జైశ్రీరామ్ అలంకారంలో 108 ప్రమిదలతో దీపోత్సవం భక్తులనే స్రుశింప చేసి పూజా ద్రవ్యాలతో గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేశారు. శ్రీరామ అష్టోత్తరం పటిస్తుండగా ఓం శ్రీ రామాయనమః అంటూ108 సార్లు భక్తులచే శ్రీరామ నామ భజనను చేయించారు. సీతారామచంద్రస్వామి వారికి 12 సార్లు హారతి ఇచ్చాక గోదావరి నదికి 21 సార్లు హారతి ఇచ్చారు.
లోక కళ్యాణార్థం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహాత్కార్యంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారు. భద్రాచలంలో జరిగే నదీహారతి కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ సతీమణి, కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం శాంతి మంత్ర పఠనం జరిపి, అశోక్, పావని, ఆర్‌వీ భద్రరావు, సతీష్ రెడ్డి, వేజెండ్ల కార్తీక్, ఫ్రెండ్స్ (నాన్ లోకల్) ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదం, నైవేద్యం, శనగలు భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో వరలక్ష్మి, పురోహితులు సురేష్ వర్మ, పవన్ కుమార్ శర్మ, కారంబరీ కృష్ణ శర్మ, రామాచార్యులు, ఫణి కుమార్ శర్మ, సత్య ప్రసాద్ శర్మ, తేజ శర్మ, స్వచ్చంద సంస్థలు, భద్రాద్రి కా మహారాజు ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






