ఘనంగా శ్రీ వాసవీ మాత జయంతి
27-04-2026 12:15 AM
చిట్యాల, ఏప్రిల్ 26: చిట్యాల పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలను మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ పందిరి గీత రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులు, డిసిసి కార్యదర్శి పోకల దేవదాస్, పందిరి శ్రీనివాస్, పాటి మాధవరెడ్డి, కౌన్సిలర్లు ఏర్పుల పరమేష్, బొబ్బలి సందీప రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






