ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దొంగతనాలు
27-04-2026 12:17 AM
నల్లగొండ క్రైం, ఏప్రిల్ 26 : ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాత్రిపూట ధాన్యం బస్తాలు చోరీకి గురవుతుండడం రైతులలో ఆందోళన కలిగిస్తుంది. నల్లగొండ పట్టణ సమీపంలోని మామిళ్లగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాజీ సర్పంచ్ మెట్టు యాదయ్య యాదవ్ కు సంబంధించిన 10 బస్తాల ధాన్యం బాధిత రైతు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు రాత్రి సమయంలో ధాన్యం దొంగతనం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టించి ధాన్యం సెంటర్లో రెయిన్బోలు పడిగాపులు ఉండి అమ్ముకునేందుకు కష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా చెన్నారం, పర్వతగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దొంగతనం జరిగిన విషయం విధితమే.






