ఘనంగా వెజ్ అలాయ్ బలాయ్
ముఖ్య అతిథిగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్, ఏప్రిల్ 26(విజయక్రాంతి): తెలంగాణ సంప్రదాయాల్లో వెజ్ వంటకాలకు ప్రాధాన్యత ఉందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆది వారం నగరంలో నిర్వహించిన ‘వెజ్ అలా య్ బలాయ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ సంప్రదాయ శాఖాహార వంటకాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరైయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతి థిగా మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మె ల్యే చింతల రాంచంద్రారెడ్డి, లంకల దీపక్ రెడ్డి, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నిర్వా హకుడు పెరిక సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ సంప్రదాయ శాఖాహార వంటకాలతో పాటు ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. అతిథు లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిం చనున్నట్లు వెల్లడించారు.






