19 March, 2026 | 5:02 AM

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఘన స్వాగతం

19-03-2026 12:20 AM

బూర్గంపాడు, మార్చి18 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సారపాక లోని సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ చేరుకున్నారు. ఐటీసీ గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందానికి డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీలత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఉపేందర్ ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు తహశీల్దార్ రామకృష్ణ ప్రసాద్, దమ్మపేట ఏటిడిఓ చంద్రమోహన్, భద్రాచలం ఏఎస్ డబ్ల్యూ హనుమంతరావు, ఏఎస్ డబ్ల్యూ ఓ/హెచ్ డబ్ల్యు ఓ పాల్వంచ సి హెచ్ అక్షయ్,గిరిజన సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.