19 March, 2026 | 5:01 AM

నవోదయలో సీటు సాధించిన బ్రిలియంట్ విద్యార్థి

19-03-2026 12:19 AM

బూర్గంపాడు,మార్చి18(విజయక్రాంతి): మంగళవారం ప్రకటించిన నవోదయ ఫలితాల్లో సారపాక బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ నుండి ఎం.జస్వంత్ సీటు సాధించినట్లు ఆ విద్య సంస్థల చైర్మన్ డాక్టర్ బి.ఎన్.ఆర్ తెలిపారు.ఈ సందర్భంగా బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్.బిఎన్‌ఆర్ మాట్లాడుతూ... వేల మంది పోటీపడ్డ పరీక్షలో తమ విద్యార్థి విజయం సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు.

ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు.బ్రిలియంట్ కోచింగ్ సెంటర్ నుండి ఎందరో విద్యార్థులు నవోదయ,సైనిక్ స్కూల్ లో సీట్లు సాధించడం ఎంతో గర్వంగా ఉందని రాబోయే నవోదయ రెండవ లిస్ట్ లో కూడా సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.నవోదయ సీటు సాధించిన జస్వంత్ ను ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులు అభినందించారు.