ఉదయ్ నాగరాజుకు ఘన స్వాగతం
బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్‌గా నియమితులై.. తొలిసారి స్వగ్రామం
కోహెడ, ఆగస్టు 11, (విజయక్రాంతి): కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు ను గ్రామస్తులు, కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం ఫలికారు. (లండన్ లో) ఇటీవల బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్ గా నియమింపబడి ప్రమాణస్వీకారం చేసి తొలిసరిగా స్వగ్రామానికి ఉదయ్ నాగరాజు వచ్చారు. దింతో గ్రామస్తులు సన్మాన సభ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టానికి చెందిన వ్యక్తి శాశ్వత రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై.. కోహెడ మండలానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని కొనియాడారు.
భారత దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ దేశానికి శాశ్వత రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక కావడం అనేది హర్షనియమన్నారు. మండలం నుండి విద్యార్థులు కానీ ఉద్యోగ రీత్యా వచ్చిన వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మన బిడ్డలుగా గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాగా తన సహాయ సహకారం ఎప్పుడు ఉంటుందని ఉదయ్ నాగరాజు హామీ ఇచ్చారు. కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ శ్యామల, సర్పంచ్ లక్ష్మయ్య మాజీ సర్పంచ్ లు కర్ర రవీందర్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు శెట్టి సుధాకర్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.






