20 March, 2026 | 5:46 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

గడగడలాడిస్తున్న భారత గ్రాండ్ మాస్టర్లు

16-09-2024 04:32 AM

బుడాపెస్ట్ (హంగేరి): 45వ చెస్ ఒలింపియాడ్ పోటీల్లో భారత గ్రాండ్ మాస్టర్లు సత్తా చాటుతున్నారు. ఓపెన్ కేటగిరీతో పాటు, మహిళల కేటగిరీలో కూడా తొలి నాలుగు రౌండ్లు గెలిచిన భారత ప్లేయర్లు ఐదో రౌండ్లో కూడా గెలుపు దిశగా సాగుతున్నారు. భారత పురుషుల జట్టు తొలి రౌండ్‌లో 4 తేడాతో మొరాకోను, రెండో రౌండ్లో 4 తేడాతో ఐస్‌ల్యాండ్‌ను, మూడో రౌండ్లో 3.5 తేడాతో హంగేరీ నాలుగో రౌండ్లో 3.5 తేడాతో సెర్బియాను మట్టికరిపించింది.

మహిళల జట్టు మొదటి రౌండ్లో 3.5 తేడాతో జమైకా మీద, రెండో రౌండ్లో 3.5 తేడా తో చెక్ రిపబ్లిక్ మీద, మూడో రౌండ్లో 3 తేడాతో స్విట్జర్లాండ్ మీద, నాలుగో రౌండ్లో 3.5 తేడాతో ఫ్రాన్స్ మీద విజయం సాధించింది. ఐదో రౌండ్లో పురుషుల జట్టు అజర్‌బైజాన్‌తో తలపడుతుం డగా, మహిళల జట్టు కజకిస్తాన్‌తో తలపడుతోంది.