calender_icon.png 12 November, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యం భారతీయతకు మూల స్ఫూర్తి

12-11-2025 12:00:00 AM

-నవాబ్ రౌనక్ యార్ ఖాన్

-జైభారత్ ముస్లిం రివల్యూషనరీ ఫోరమ్ 

-ఇతేహాద్ రెండో సదస్సు విజయవంతం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): జైభారత్ ముస్లిం రివల్యూషనరీ ఫోరం ఇతెహాద్ రెండో సమావేశం జైభారత్ హెడ్‌క్వార్టర్స్, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ భవన్, విజయవిహారం బుక్ సెంటర్, ఎల్.బి.నగర్, హైదరాబాద్‌లో మూడు రోజులపాటు కొనసాగి మంగళవారం విజయ వంతంగా ముగిసింది. జైభారత్ అనేది జాతీ య ఏకత, మతాంతర సామరస్యం, సామాజిక న్యాయం, మానవతా విలువలను బలో పేతం చేయడానికి కట్టుబడి ఉన్న రాజకీయేతర ప్రజోద్యమం.

ఇందుకు అనుబంధంగా ఉన్న జైభారత్ ముస్లిం రివల్యూషనరీ ఫోరం ముస్లిం సమాజంలో అంతర్గత సంస్కరణ, మతాంతర అవగాహన, సామాజిక బాధ్యత వంటి అంశాలపై నిర్మాణాత్మక చర్చలకు వేదికగా పనిచేస్తోంది. ఈ ఫోరంప్న రామణ మూర్తి సమన్వయం చేస్తున్నారు. మొదటి సమావేశాన్ని సెప్టెంబర్ 28, 2025న అసఫ్ జాహీ వంశంలో 9వ నిజాంగా విస్తృత కుటుంబం ప్రజాస్వామ్య పద్ధతిలో గుర్తించిన నవాబ్ రౌనక్ యార్ ఖాన్ ప్రారం భించి, భారతీయ సంస్కృతిలో భాగస్వామ్య వారసత్వంపై ప్రసంగించారు. 

రెండో సమావేశంలో ఘృణ, అసమాన త, అసహనంను తిరస్కరించే ముస్లిం ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతి థి జనాబ్ అబ్దుల్ ఖయూం నాయక్ (కాశ్మీ ర్) హాజరై, మతాంతర సంభాషణను బలోపేతం చేయడం, సమాజ విభజనను తగ్గిం చడం, సంస్కృతిక బంధాలను పటిష్టం చేయడం అత్యవసరమని అన్నారు. నవాబ్ రౌనక్ యార్ ఖాన్  సౌహార్ద వారసత్వాన్ని ఆచరణలో నిలబెట్టిన నాయకుడు. ఆసుఫ్ జాహీ వంశ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ దయ, న్యాయం, మతసామరస్య పరిపాలనకు చారిత్రకంగా గుర్తింపు పొందారు అనే విషయాన్ని సయీదా ఇమామ్ రచించిన అన్‌టోల్డ్ చార్మినార్ పుస్తకంలో  సిరిల్ జోన్స్, సరస్వతి నాయుడు స్మృతులు, సర్ ఎం విశ్వేశ్వరయ్య వర్ణనలు స్పష్టంగా చెప్పా యి.

ఈ మతాంతర సహజీవన వారసత్వా న్ని నావాబ్ రౌనక్ యార్ ఖాన్ గత యాభై ఏళ్లుగా ఆచరణలో కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం తన నివాసంలో హోలీ వేడుకలను అన్ని మతాల ప్రజలతో కలిసి జరుపు తున్నారు. సంక్రాంతి వేడుకలను కూడా సర్వమత సాన్నిహిత్య వాతావరణంలో నిర్వహిస్తున్నారు. దుర్గాపూజ, సరస్వతి పూజ, యూసుఫైన్లో సుఫీ ఉత్సవాలు, నాందేడ్ గురుద్వారా సేవా కార్యక్రమాలు, క్రైస్తవ సమాఖ్య సమావేశాలు, మహాప్రస్థానంలో సామాజిక సేవా కార్యక్రమాలు, ఆలయ ప్రారంభ సేవా సహకారం వంటి అనేక కార్యక్రమాలకు ఆయన గౌరవ అతిథిగా ఆహ్వానితులయ్యారు. మతాల మధ్య సంబంధాలు, విశ్వాసం, గౌరవం నెలకొల్పడంలో చేసిన సేవలకు ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడింది.

ఈ కార్యక్రమంలో నవాబ్ రౌనక్ యార్ ఖాన్ ప్రసంగిస్తూ సామరస్యాన్ని ఉపన్యాసాల్లో కాదు  జీవనం లో ఆచరించాలని, మనుషులు కలిసి పండుగలు చేసుకున్నప్పుడు, భోజనం పంచుకున్న ప్పుడు, ప్రార్థనలు పంచుకున్నప్పుడు  విశ్వా సం పునర్నిర్మితమవుతుందన్నారు. రౌనక్ మాట్లాడుతూ అసఫ్ జాహీ వంశ సంప్రదాయం అనేది ప్రతి సమాజాన్ని గౌరవించే దయ, సేవ, మానవత. ఆ వారసత్వం ఒక కుటుంబానికి మాత్రమే కాదు  హైదరాబాద్కు, భారతదేశానికే చెందిందని, దాన్ని కాపాడటం మన బాధ్యత అన్నారు.