2 April, 2026 | 6:03 AM

ఘనంగా విద్యార్థుల ప్రదర్శనలు..

07-12-2024 06:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ ఫెయిర్ ను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శనివారం సందర్శించారు. వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శన చేసిన ఎగ్జిబిషన్లను పరిశీలించి వాటి ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. సైన్స్ విజ్ఞానంపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.