2 April, 2026 | 7:50 AM

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

07-12-2024 06:09 PM

నిర్మల్ (విజయక్రాంతి): విద్యా శాఖలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి శంకర్, పి అశోక్ కుమార్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్ల వద్ద సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని శనివారం సందర్శించి మద్దతు పలికారు. సంవత్సరాల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని దీనికి సంపూర్ణ మద్దతు సంఘం ద్వారా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు గంగాధర్ మౌనిక గంగామణి తదితరులు పాల్గొన్నారు.