15 June, 2026 | 2:49 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

జీఆర్‌ఐఈటీ విద్యార్థుల ఘన విజయం

06-02-2026 12:47 AM

ఎన్‌ఐడీఏఆర్‌లో రూ.లక్ష బహుమతి

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఆర్‌ఐటీటీ) కు చెందిన విద్యార్థులు జనవరి 10 నుంచి 17 వరకు గ్రేటర్ నోయిడాలోని గౌత మ్ బుద్ధ యూనివర్సిటీలో నిర్వహించిన నే షనల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫర్ డ్రోన్ అప్లికేషన్ అండ్ రీసెర్చ్ (నిడార్) 2026లో జాతీ య స్థాయిలో విశేష విజయం సాధించారు. సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్స్‌పెడిషన్ (సార్క్స్ ఎన్251751) అనే విద్యార్థుల బృందం మిషన్1: డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి, దేశవ్యాప్తంగా పాల్గొన్న బృందాలలో టాప్5లో ఒక టిగా నిలిచి, ప్రతిష్ఠాత్మకమైన రూ.లక్ష నగదు బహుమతని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం, డైరెక్టర్, సీని యర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రిన్సిపాల్, డీ న్లు, విభాగాధిపతులు, డీన్  స్టూడెంట్స్ అఫై ర్స్, ఈ మిషన్కు మార్గదర్శకత్వం వహించిన ఫ్యాకల్టీ మెంటర్లకు సంస్థ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.