16-12-2024 12:02:56 AM
అండర్ మహిళల ఆసియా కప్
కౌలలంపూర్: అండర్ మహిళల టీ20 ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయి సాధించింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులకే పరిమితమైంది. కోమల్ ఖాన్ (24) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో సోనమ్ యాదవ్ 4 వికెట్లతో రాణించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిలు 7.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 68 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డబ్ల్యూపీఎల్ వేలంలో మెరిసిన కమలిని (44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చింది. కాగా భారత్ మంగళవారం నేపాల్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.