calender_icon.png 12 November, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిమ్రన్‌కు రూ.1.90 కోట్లు

16-12-2024 12:33:23 AM

*  డబ్ల్యూపీఎల్ మినీ వేలం

బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కొత్త సీజన్ కోసం ఆదివారం మినీ వేలం నిర్వహించారు. బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లకు ఊహించని ధరకు అమ్ముడవ్వడం విశేషం. మొత్తం 19 స్లాట్స్ కోసం జరిగిన వేలంలో 120 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ సిమ్రన్ షేక్ అత్యధిక ధర దక్కించుకోవడం విశేషం. రూ.10 లక్షల కనీస ధరతో బరిలోకి దిగిన సిమ్రన్ కోసం ఢిల్లీ, గుజరాత్ పోటీ పడ్డాయి. చివరకు గుజరాత్ జెయింట్స్ రూ.1.90 కోట్లకు కొనుగోలు చేసింది. విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా దొతిన్ రూ.1.70 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.

ఆమె కనీస ధర రూ. 50 లక్షలు కాగా గుజరాత్, యూపీ వారియర్స్ పోటీపడ్డాయి. భారత అండర్ జట్టుకు చెందిన 16 ఏళ్ల కమలిని కోసం ముంబై ఇండియన్స్ రూ.1.60 కోట్లు ఖర్చు చేయగా.. ప్రేమా రావత్‌ను రూ.1.20 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. భారత స్టార్ ప్లేయర్లు పూనమ్ యాదవ్, స్నేహ్ రాణాతో పాటు విదేశీ ఆటగాళ్లు హీథర్ నైట్, సారా గ్లెన్, కిమ్ గార్త్ సహా చాలా మంది అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.

సెపక్ తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన జాతీయ సెక్రటరీగా పెరిక సురేష్ ఎన్నికయ్యారు. ఆదివారం న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశంలో నూతన జాతీయ కార్యవర్గం ఎన్నుకున్నారు. ఫెడరేషన్ జాతీయ అధ్యక్షునిగా యోగేంద్రసింగ్ ఎంపికయ్యారు. గ్రామీణ స్దాయి నుంచి అంతర్జాతీయ స్దాయికి సెపక్ తక్రా క్రీడను మరింత విస్తృతం చేస్తామని సురేశ్ తెలిపారు.