5 April, 2026 | 5:31 AM

ఉద్యోగుల పోరుబాట

05-04-2026 01:05 AM
  1. దశలవారీగా పోరాటం 
  2. లంచ్ టైంలో నిరసనలు, రిలే నిరాహార దీక్షలు!
  3. 7న రాష్ట్రస్థాయి విస్తృత భేటీలో కార్యాచరణ 
  4. ఇక ఉద్యమమే అంటున్న జేఏసీ నేతలు

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మరోసారి ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమవుతోంది. తమ డిమాండ్ల సాధనకు ఉద్యమం అనివార్యమని ఉద్యోగ జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే దశలవారీగా పోరుకు సిద్ధమయ్యేందుకు కార్యాచరణను రూపొంది స్తున్నారు.

పెండింగ్ బిల్లులు, డీఏలు, హెల్త్ కార్డులు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి ప్రధాన సమస్యలను ఎజెండాగా చేసుకొని ప్రభుత్వానికి తమ గోడును మరోసారి వినిపిస్తామని, అప్పుడు కూడా సర్కారు పెడచెవిన పెడితే ఉద్య మం సాగిస్తామని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. పెండింగ్ సమస్యల పరి ష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గత ప్రభుత్వం నుంచి ఏండ్ల తరబడిగా ఎదురుచూస్తున్నారు.

ఈ బడ్జె ట్ సమావేశాల్లోనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ చూసిన వారికి నిరాశే మిగిలింది. ఉద్యోగులు కోరుకుంటున్న వాటిల్లో ప్రధానంగా క్యాష్‌లెస్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ న్యూ హెల్త్ స్కీం, 4 పెండింగ్ డీఏలు, దాదాపుగా రావాల్సిన రూ.13,000 కోట్ల పెండింగ్ బిల్లులు, పీఆర్సీ అమలు చేయడంతోపాటు కాం ట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను అమలు చేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా వీటిని పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.  

ఒకడుగు ముందుకు..

ఉద్యోగుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గతం లో జేఏసీ నేతలు ఉద్యమ కార్యాచరణ ను ప్రకటించారు కూడా. గతేడాది డిసెంబర్ 9ని డెడ్‌లైన్ కూడా విధించారు. అయితే ప్రభుత్వం జేఏసీ నేతలతో చర్చ లు జరిపి పలు ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడంతోపాటు నెలకు రూ. 700 కోట్లకు పైగా ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదలకు ఒప్పుకోవడంతో ఉద్యమాన్ని వాయిదావేశారు.

ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి నెలకు రూ. 700 కోట్లకు చొప్పున బిల్లులు విడుదలవుతున్నాయి. అయితే ఇది తమకు సరిపోదని, తమ బకాయిలే మొత్తం రూ. 13,000 కోట్ల వరకు ఉన్నాయని.. నెల కు రూ.700 కోట్లు కాకుండా రూ. 1,500 కోట్లు విడుదల చేయాలంటున్నారు. పొరుగునున్న ఏపీలో అక్కడి ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు దాదాపు రూ.32 వేల కోట్లుంటే అందులో ఒకేసారి రూ.7,000 కోట్లను విడుదల చేయడం గమనార్హం.

ఇక్కడ మాత్రం జేఏసీ నేతల డిమాండ్ మేరకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగతా హామీలను ప్రభుత్వం పరిష్కరించలేకపోవడంతో అటు ప్రభుత్వం, ఇటు జేఏసీ నేతలపై కిందిస్థాయి ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఉద్యమాన్ని జేఏసీ నేతలు మధ్యలోనే వదిలేస్తున్నారని, ఒకడుగు ముం దుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా ఉద్యమాన్ని నడిపుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

సమస్యలన్నీ పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమించాల్సిందేనని క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 7న జేఏసీ రాష్ట్ర విస్త్రృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి అందులో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు జేఏసీ కీలక నేత ఒకరు తెలిపారు.

మధ్యాహ్నం భోజన విరామం సం యంలో నల్ల బ్యాడ్జీలు దరించి కార్యాలయాల ముందు నిరసన తెలపడం, రిలే నిరాహార దీక్షలు చేపట్టడం లాంటి దశలవారీగా కార్యాచరణను తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇంతవరకు అమలుకు నోచుకోవడంలేదు. నివేదిక ఇప్పటికే సిద్ధం అయినా పీఆర్సీ కమిటీ నుంచి నివేదికను తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగాలేదని తెలుస్తోంది. 

ఒకవేళ అది తీసుకుంటే దాన్ని అమలుచేయాల్సి వస్తుందని, ప్రభుత్వంపై మరింత ఆర్థికభారం పడుతుందని వెనకడుగు వేస్తున్నట్లుగా ఉద్యోగ జేఏసీ నేతలు చెబుతు న్నారు. పీఆర్సీ కమిటీ గడువు పొడిగిస్తూ పోతున్నారు తప్పితే దానిని అమలుచేసేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ఒడిదు డుకుల వల్ల సీపీఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతా ల నుంచి ఒక్కోక్కరికి సుమారు రూ.30 వేల నుంచి లక్ష వరకు నష్టం వాటిలిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలోనే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలుచేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులే అడ్డు.. 

ప్రభుత్వం ఆరు నెలలకోసారి డీఏ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఇంకా నాలుగు డీఏలను ఉద్యోగులకు ప్రభుత్వం బాకీపడింది. 01-01-2024, 01-07-2024, 01-01-2025, 01-07-2025 వరకు నాలుగు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇందులో రెండు లేదా మూడు డీఏలను ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా... కనీసం ఒక్క డీఏ ఇచ్చినా ఉద్యోగులు సరిపెట్టుకుంటారనే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. ఇక ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న పథకం క్యాష్‌లెస్ ఎంప్లాయీస్ న్యూ హెల్త్ స్కీం.

దీనిపై ఉన్నతస్థాయి అధికారులు సమావేశం ఏర్పాటుచేసి వెంటనే కార్డులు జారీ చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి దీన్ని అమలుచేస్తారని ఉద్యోగులంతా భావించారు. కానీ దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. అసలు తమ సమస్యలను అడ్డు కుంటున్నది ఉద్యోగులేనని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నా, తమకు సమయం ఇస్తున్నా.. కొందరు అధికారు లు కావాలనే కొర్రీలు పెడుతున్నారని వి మర్శలు చేస్తున్నారు.

అధికారులు అనుకుంటే తమ సమస్యలు ఇప్పటికే చాలా వరకు పరిష్కారమయ్యేవని ఓ నేత పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీస్ కార్డులు ఇ వ్వాలని ఫిబ్రవరి 23న ప్రకటించి దీనికో సం ఉద్యోగుల నుంచి రూ.528 కోట్లు సే కరించి అంతే మొత్తాన్ని ప్రభు త్వం కూడా తన వాటాగా హెల్త్ ట్రస్టులో జమచేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.