5 April, 2026 | 5:47 AM

సహజ మరణానికి 10 లక్షల బీమా

05-04-2026 01:28 AM
  1. సింగరేణి యాజమాన్యం చొరవతో యూనియన్ బ్యాంక్ నిర్ణయం
  2. ఏప్రిల్ 1 నుంచి అమలు

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమాను అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ తాజా గా మరో నిర్ణయం తీసుకుంది. సింగరేణి యాజమాన్యం చొరవతో ప్రమాద బీమానే కాకుండా సహజ మరణానికి కూడా రూ. 10 లక్షల బీమాను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ ఒకటి తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించడంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు యూనియన్ బ్యాంక్‌లో కార్పొరేట్ శాలరీ అకౌంట్ తీసుకుంటే వారికి రూ. కోటి ప్రమాద బీమా పథకం అమలవుతోంది. ఈ నేపథ్యంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి ఆదేశాలతో డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పొట్రు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీనితో ఏప్రిల్ ఒకటి నుంచి కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న వారందరికీ రూ.10 లక్షల సహ జ మరణం బీమాను కూడా అమల్లోకి తీసుకొచ్చారు.

ఇతర ఇన్సూరెన్స్ కంపెనీల్లో రూ. 10 లక్షల బీమా పాలసీని తీసుకోవాలంటే కనీసం రూ.ఐదు వేలకు పైగా చెల్లించాల్సి ఉం టోంది. సింగరేణి యాజమాన్యం తీసుకున్న చొరవ కారణంగా ఒక్కపైసా కూడా చెల్లించకుండా, సహజ మరణానికి రూ. 10 లక్షల బీమాను యూనియన్ బ్యాంక్ అమలు చేయడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.