15-12-2024 04:00:38 PM
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో రోజు తన అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. బుమ్రా 72 పరుగులకు 5 వికెట్లతో మెరిశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లు ఈ మ్యాచులో రెచ్చిపోయి ఆడారు. ట్రావిస్ హెడ్(152), స్మిత్ (101) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కేరీ (45), మిచెల్ స్టార్క్ (07) ఉన్నారు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసుకోగా, నితీశ్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. బుమ్రా టెస్టు కెరీర్ లో 12వ సారి ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. 7 ఫైఫర్‌లతో జాబితాలో ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న లెజెండరీ కపిల్ దేవ్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. గబ్బా టెస్టులో టాస్ గెలిచిన భారత్ కు పెద్దగా అచ్చురాలేదు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ భారీ స్కోరు సాధించి పట్టుబిగించేందుకు ప్రయత్నిస్తోంది.