18-07-2025 12:02:59 AM
- కేంద్రమంత్రి మనోహర్‌లాల్ చేతుల మీదుగా
- స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు స్వీకరించిన కార్యదర్శి, కమిషనర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణలోనే స్వచ్ఛ షహర్‌గా ‘గ్రేటర్ హైదరాబాద్’ ఎంపికైంది. ఈ నేపథ్యంలో గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్‌లాల్ చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును పురపాలక పట్టణాభివృద్ధి కార్యదర్శి డాక్టర్ కే ఇలాంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ స్వీకరించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో 10 లక్షలు ఆపైన జనాభా ఉన్న నగరాల్లో ‘వ్యర్థాల రహిత నగరం’ క్యాటగిరీలో హైదరాబాద్ ఉత్తమ ప్రతిభ కనబరిచి 6వ ర్యాంక్‌తో 7 స్టార్ రేటింగ్ పొంది స్వచ్ఛ షహర్‌గా నిలిచింది. ఓడీఎఫ్‌లో వాటర్ సర్టిఫికెట్ కూడా జీహెచ్‌ఎంసీకి అవార్డు దక్కిం ది. గత సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ 9వ ర్యాంక్‌తో 5 స్టార్ హోదా పొందింది. అవార్డుల స్వీకరణ కార్యక్రమంలో శానిటేషన్ ఏసీ రఘు ప్రసాద్, సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎస్ బీఎం యశశ్రీ రెడ్డి, శానిటేషన్ సూపర్‌వైజర్ సుదర్శన్, శానిటేషన్ కార్మిదర్శి ఊర్మిళ తదితరులు పాల్గొన్నారు.