18 July, 2026 | 2:58 AM

రెండో సినిమాకూ గ్రీన్‌సిగ్నల్

03-12-2024 02:11 AM

నందమూరి మోక్షజ్ఞ.. ఒక్క సినిమానే మొదలు పెట్టలేదు. అసలు ఎప్పుడు మొదలవుతుందనేది ఊహాగానాలు తప్ప ఎవరికీ క్లారిటీ లేదు. అలాంటిది రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. అసలు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అవి ఇన్నాళ్లకు నిజమని తేలాయి. ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ద్వారా మోక్షజ్ఞ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ముందస్తు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో మోక్షజ్ఞ మరో సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ‘లక్కీ భాస్కర్’తో మంచి విజయం అందుకున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో మోక్షజ్ఞ నటించనున్నారట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకీ అట్లూరి నిర్మించనున్నారట. ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయట.