కృష్ణుడే సూపర్ స్టార్
శ్రీకృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక అద్భుతాన్ని ప్రేరణగా తెరకెక్కుతున్న చిత్రం ‘డియర్ కృష్ణ’. అక్షయ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. ఐశ్వర్య మరో హీరోయిన్. దినేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. సోమవారం హైదరాబాద్‌లో విలేక రుల సమావేశంలో చిత్రబృందం ఈ సినిమా విషయాలను పంచుకుంది.
నిర్మాత బలరామ్ మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమాకు నిర్మాతగా కాకుండా కృష్ణుడి సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న వ్యక్తిగానే పరిగణించుకుంటున్నాను. మా కొడు కు అక్షయ్ అత్యంత రేర్ డిసీజ్ నుంచి, డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు’ అన్నారు. నాయకానాయికలు అక్షయ్, ఐశ్వర్యతో పాటు గీత రచయిత గిరి పట్ల, నటుడు లోహిత్, డైలాగ్ రైటర్ నాగ నందేశ్వర్ పాల్గొన్నారు.






