13 August, 2026 | 5:14 AM

మహిళా సమైక్య భవనానికి భూమి పూజ

13-08-2026 12:44 AM

కొండపాక, ఆగష్టు 12 (విజయక్రాంతి): కొండపాక మండల కేంద్రంలో మహిళ సమైక్య భవన నిర్మాణానికి బుధవారం కొండపాక సర్పంచ్ మంచాల నవీన భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొండపాక సర్పంచ్ మంచాల నవీన మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల సమావేశాలకు శిక్షణ కార్యక్రమాలకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.